Movie Muzz

ఏం జరుగుతుందో తెలుసా? ‘అనుమాన పక్షి’ హాస్యభరిత మిస్ట్రీ!

ఏం జరుగుతుందో తెలుసా? ‘అనుమాన పక్షి’ హాస్యభరిత మిస్ట్రీ!

‘డీజే టిల్లు’తో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ రాగ్ మయూర్ హీరో గా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో హిలేరియస్ ఎంటర్టైనర్ ‘అనుమాన పక్షి’ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాతలు రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ కథానాయిక. ఈ చిత్రం టైటిల్,  ఫస్ట్-లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ ఇప్పుడు రాగ్ మయూర్ పాత్ర ద్వారా సినిమా రిలీజ్ టైంని వెల్లడించే ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాగ్ మయూర్ అనుమాన పక్షిగా పరిచయం అయ్యారు. అతిగా ఆలోచించడం, అతిగా జాగ్రత్తగా ఉండే స్వభావంతో తన చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే విచిత్రమైన క్యారెక్టర్ ఆకట్టుకుంది. ప్రోమోతో పాటు, చిత్ర ప్రచార కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుందని తెలియజేశారు.  ఖచ్చితమైన తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు. బలమైన పాత్రలతో అలరించే దర్శకుడు విమల్ కృష్ణ, ప్రత్యేకంగా రాగ్ మయూర్ కోసం రూపొందించిన యూనిక్ క్యారెక్టర్ తో వస్తున్నారు.  

editor

Related Articles