బాధితురాలికి అన్యాయం జరిగితే ఆమెకు మద్దతునిస్తా అన్న ఆనీ మాస్ట‌ర్

బాధితురాలికి అన్యాయం జరిగితే ఆమెకు మద్దతునిస్తా అన్న ఆనీ మాస్ట‌ర్

ఓ లేడీ డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై ఆరోప‌ణ‌లు రాగా అత‌డిపై ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2)తో పాటు పోక్సో కేసులు పెట్టారు. లైంగిక వేధింపుల కేసులో  కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌ అరెస్ట్ అయిన విష‌యం మీకు తెలుసు. ప్ర‌స్తుతం బెయిల్ మీద బ‌య‌ట‌కు వచ్చిన జానీ మాస్ట‌ర్ విష‌యంపై తాజాగా ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ రియాక్ట్ అయ్యింది. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసినప్ప‌టి నుండి నేను షాక్‌లో ఉన్నాను. జానీ మాస్టర్‌తో క‌లిసి రెండేళ్లు పని చేశా. నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. జానీ చాలా మంచి వ్యక్తి. ఎంతోమంది డ్యాన్సర్లకు ఫుడ్ పెట్టిన వ్యక్తి. అయితే నేను ఇన్నిరోజులు క‌లిసి ప‌నిచేసిన మాస్టర్ ఇలా చేశాడా అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నేను కూడా అంద‌రిలాగే టీవీలో న్యూస్ చూసి తెలుసుకున్నాను. ఇది అమ్మాయి విషయం కాబట్టి ఇప్పుడు ఎవరూ కూడా మాట్లాడడం లేదు. ఒకవేళ బాధితురాలికి నిజంగా అన్యాయం జరిగితే ఆమె త‌ర‌పున‌ మద్దతుగా నిలబడడానికి నేను సిద్ధం అన్న ఆనీ మాస్ట‌ర్.

administrator

Related Articles