సినిమాలకు బ్రేక్.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన అనిరుధ్!

సినిమాలకు బ్రేక్.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన అనిరుధ్!

సంగీత సంచలనం, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన సొంత ఇండిపెండెంట్ మ్యూజిక్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి రూపొందించిన ‘అరవింద్’ పాటను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ఒరిజినల్ పాప్-హిప్ హాప్ ట్రాక్ అనిరుధ్ సంగీత ప్రయాణంలో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తోంది. ‘వై దిస్ కొలవెరి డి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్, అనంతరం జైలర్, విక్రమ్, లియో, దేవర వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించి రాక్‌స్టార్‌గా పేరు సంపాదించారు. ‘అరవింద్’ పాటలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ఎదగాలనుకునే యువ సంగీతకారుడు ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలు, ఆశలు ప్రతిబింబిస్తాయి. కథలోని అరవింద్ పాత్ర అనిరుధ్ నిజజీవిత ప్రయాణానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. డిజిటల్ యుగంలో ప్రతిభను నిరూపించుకోవడానికి కళాకారుడు చేసే పోరాటాన్ని ఈ పాట హృద్యంగా ఆవిష్కరిస్తుంది. భవిష్యత్తులో అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా మరిన్ని ఇండిపెండెంట్ మ్యూజిక్, కాన్సెప్ట్ ఆధారిత ప్రాజెక్టులను తీసుకురావడానికి అనిరుధ్ సిద్ధమవుతున్నారు.

Related Articles