ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నాయకురాలు శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కారణంగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ‘Andhra365’ అనే బెట్టింగ్ యాప్‌ను శ్యామల ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ ప్రమోట్ కేసులో ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియతో పాటు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలను గురువారం విచారించిన పోలీసులు.
- March 21, 2025
0
190
Less than a minute
Tags:
You can share this post!
administrator


