అనసూయ ప్రస్తుతం శ్రీలంకలో బిజీబిజీగా గడుపుతోంది. అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంట్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఇక గృహప్రవేశం తర్వాత అనసూయ శ్రీలంక టూర్‌కి వెళ్లింది. ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన అనసూయ అక్కడి అందాలని తన ఫాలోయర్స్‌కి కూడా చూపిస్తూ రచ్చ చేస్తోంది. రీసెంట్గా బికినీ ట్రీట్ కూడా ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడుతూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. అయితే విహార యాత్రకి వెళ్లినా కూడా అనసూయ వర్కౌట్ మాత్రం ఆపడం లేదు… టూర్ టూరే, వర్కౌట్లు వర్కౌట్లే అన్నట్టు ఉంది ఆవిడ పరిస్థితి. శ్రీలంక వెళ్లిన జిమ్‌లో కసరత్తులు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. సెల్ఫ్ కేర్ మీద కాన్సెంట్రేట్ చేసినట్టు చెప్పుకొచ్చిన అనసూయ కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇక కుటుంబంతో కలిసి షాపింగ్ కూడా చేశారు అనసూయ. భర్త పిల్లలతో కలిసి శ్రీలంకలో కొన్ని వస్తువులు కొన్నారు. ఏది ఏమైన అనసూయ శ్రీలంక టూర్‌ని బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇక ఆమె టూర్ ఫొటోలు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కిస్తున్నాయి.
- May 31, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor

