భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. ప్రస్తుతం ఈ పండగకి వారం రోజులే సమయం ఉండటంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించారు. వెలుగుల పండగను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపావళి సందడి వారం ముందే వచ్చేసింది. తారలు పార్టీలంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇంట్లో.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు బీటౌన్ తారలు హాజరై సందడి చేశారు. కరీనా కపూర్, హేమామాలినీ, జెనీలియా, కరణ్ జోహార్, రేఖ, ప్రీతి జింటా, అనన్య పాండే, కృతిసనన్, కాజోల్, అదితిరావ్ హైదరి, వాణీకపూర్, సోనాక్షిసిన్హా, జహీర్ ఇక్బాల్, మలైకా అరోరా, సారా అలీఖాన్, ఖుషీ కపూర్, సుహానా ఖాన్ తదితరులు పార్టీకి హాజరయ్యారు. భారత్‌లోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ కుటుంబం కూడా ఈ పార్టీలో మెరిసింది. నీతా అంబానీ, రాధిక మర్చంట్ దీవాళీ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక దుస్తుల్లో నీతా అంబానీ, రాధిక మర్చంట్ అందరినీ ఆకర్షించారు.

- October 13, 2025
0
42
Less than a minute
You can share this post!
editor