శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి నటించిన కొత్త తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం అమరన్ దీపావళికి విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దాని OTT విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు డిసెంబరు 5 గురువారం అర్థరాత్రి నుంచే అమరన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో అభిమానులు అమరన్‌ని వీక్షించవచ్చు.
2014లో జమ్మూ కాశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వీర భారత ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ కథే ఈ సినిమా. మిలిటరీలో చేరి దేశం కోసం అంతిమ త్యాగం ఎలా చేశారు అన్నది స్టోరి.
ప్రేమ, బాధ్యత మరియు దేశభక్తిని కదిలించే కథ అమరన్. మరి మళ్లీ ఓటీటీలో ఈ సినిమా చూసేద్దామా..!