తమిళ దర్శకుడు అట్లీతో తన తర్వాత సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తుండగా.. అల్లు అర్జున్ 22వ సినిమాగా తెరకెక్కుతోంది. అట్లీకి ఇది 6వ సినిమా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఇటీవల అల్లు అర్జున్ ఒక పెళ్లికి హాజరుకాగా.. ఆయన లుక్ వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కుమార్తె అర్హతో కలిసి ఇటీవల తన కజిన్ వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ చాలా సాధారణంగానే, కానీ స్టైలిష్‌గా కనిపించారు. ఆయన లేత గోధుమ రంగు కుర్తా, నల్లటి ప్యాంటు ధరించి, కొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ నూతన వధూవరులను ఆశీర్వదించి, వారితో కలిసి ఫొటోలు దిగారు. పెళ్లిలో ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ ఫొటోలు చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్ రాబోయే అట్లీ సినిమా కోసమే అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ‘AA 22 x A6’ వర్కింగ్ టైటిల్‌తో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సినిమా రానుంది. నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- April 25, 2025
0
80
Less than a minute
Tags:
You can share this post!
editor

