సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు (75) కన్నుమూశారు. ఈరోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ, టీవీ రంగాల్లో విషాదం నెలకొంది. గోపాలరావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ కూడా సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటిస్తున్నారు. గోపాలరావు పార్థివ దేహాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్‌మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి.
- June 14, 2025
0
188
Less than a minute
Tags:
You can share this post!
administrator

