బాలకృష్ణ ముందు పద్యం పాడిన అల్లు అర్జున్ కూతురు అర్హ..

బాలకృష్ణ ముందు పద్యం పాడిన అల్లు అర్జున్ కూతురు అర్హ..

హీరో అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా చెప్పవలసిన పనిలేదు. బ‌న్నీ సోష‌ల్ మీడియాలో ఎంత ఫేమ‌స్సో .. ఆయన గారాల ప‌ట్టి అల్లు అర్హ కూడా అంతే ఫేమ‌స్‌. ఇక నెట్టింట తండ్రీ కూతురు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి తరచూ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. వీడియోల్లో అర్హ తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంటుంది. అయితే అల్లు అర్హ తాజాగా బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాప‌బుల్’ షో సీజ‌న్ 4కు హాజ‌ర‌య్యింది. త‌న తండ్రితో పాటు షోకి వ‌చ్చిన అల్లు అర్హ బాల‌య్య‌తో స‌ర‌దాగా కబుర్లు చెప్పింది. ఇక బాల‌య్య కూడా అల్లు అర్హ‌తో సంద‌డిగా గ‌డప‌డమే కాకుండా.. ద‌గ్గ‌రికి తీసుకుని ముద్దాడాడు. అయితే ఈ షోలో బాల‌య్య అల్లు అర్హ‌ను అడుగుతూ.. తెలుగు వచ్చా అమ్మ అని అడుగుతాడు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. తెలుగు రావటమా.. అంటూ తన కూతురు చెవిలో ప‌ద్యం పాడు అంటాడు. దీంతో అల్లు అర్హ అల్ల‌సాని పెద్ద‌న్న ర‌చించిన మ‌ను చరిత్ర‌లోని అటజని కాంచె భూమిసురు డంబర చుంబి అంటూ ఫుల్ ప‌ద్యం చ‌దివేస్తుంది. దీంతో ఒక్క‌సారిగా షాక్ తింటాడు బాల‌య్య.

administrator

Related Articles