‘బన్నీ’ కెరీర్‌లోనే హైలెట్ అని చెప్పాలట!

‘బన్నీ’ కెరీర్‌లోనే హైలెట్ అని చెప్పాలట!

హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ’ సినిమాపై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బన్నీపై వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయట. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటుందని.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని.. పైగా ఈ సినిమాకే కాకుండా, అల్లు అర్జున్ సినీ కెరీర్‌లోనే ఈ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచిపోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే, బన్నీ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్‌గా నిలిచిపోతుంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్‌ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి. అన్నట్టు బన్నీ పాత్రలో మూడు కోణాలు ఉంటాయని, పైగా బన్నీ నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడని.. ఇలా చాలారకాల వార్తలు వినిపిస్తున్నాయి.

editor

Related Articles