రాత్రి పొద్దుపోయేక 10 తరువాత బెయిల్ పేపర్స్ వచ్చాయని అప్పటిదాకా వెయిట్ చేశామని, ఇక చేసేదేమీ లేక పొద్దున్నే రిలీజ్ చేశామని జైలు అధికారులు చెప్పారు. పొద్దున్న 6.30 తర్వాత విడుదల అయి అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్లారు. చంచల్‌గూడ జైలు నుండి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. మధ్యంతర బెయిల్ వచ్చినా ఒక రోజు జైలు జీవితం తప్పలేదు.
- December 14, 2024
0
124
Less than a minute
Tags:
You can share this post!
editor


