మలయాళ దర్శకుడితో ‘సూపర్‌ హీరో’ సినిమాలో అల్లు అర్జున్?

మలయాళ దర్శకుడితో ‘సూపర్‌ హీరో’ సినిమాలో అల్లు అర్జున్?

ప్రస్తుతం బన్నీ.. అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్‌ ప్రారంభంకానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అట్లీ సినిమా తర్వాత ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నాడని, దిల్‌రాజు నిర్మాత అని ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా బన్నీ తర్వాత సినిమా గురించి ఆసక్తికరమైన వార్త జాతీయ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. మలయాళ దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సూపర్‌ హీరో సినిమా చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. మలయాళ సూపర్‌ హీరో సినిమా ‘మిన్నాల్‌ మురళీ’తో బాసిల్‌ జోసెఫ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చిందని, సూత్రప్రాయంగా సినిమాకు అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆధునిక హంగులతో తెరకెక్కించనున్న శక్తిమాన్‌ కథాంశమిదని టాక్‌.

editor

Related Articles