హీరో అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. “పుష్ప 2: ది రూల్” తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 22వ సినిమా ఇది. జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్ జూన్ 5 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేసే అవకాశం ఉందని, అలాగే ఆరుగురు హీరోయిన్లు కూడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్‌గా “ఐకాన్” లేదా “సూపర్ హీరో” వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
- June 1, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor

