రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన సినిమా శివ. ఈ సినిమాను మళ్లీ రీ-రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ములతో పాటు బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఈ సినిమాపై స్పందిస్తూ వీడియోలు విడుదల చేశారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై స్టార్ నటుడు అల్లు అర్జున్ స్పందించాడు. టాలీవుడ్ సినీ చరిత్రను మార్చిన శివ సినిమా వచ్చి దాదాపు 36 ఏళ్లు అవుతోంది. ఈ సినిమా టాలీవుడ్ నుండి వచ్చిన ఐకానిక్ సినిమాలలో ఒకటి. ఈ ఒక్క సినిమా తర్వాత టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా పరిశ్రమలో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాంటి సినిమా మళ్లీ రీ-రిలీజ్ కాబోతుంది. ఈ రీ-రిలీజ్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలి. అక్కినేని అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు నా నుండి ఒక విజ్ఞప్తి.. ఈసారి థియేటర్‌కి రెండు లారీల పేపర్లను తీసుకెళ్లండంటూ అల్లు అర్జును చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన నాగార్జున ‘డియర్ అల్లు అర్జున్.. రెండు లారీల థాంక్స్..’ అంటూ ఎక్స్ వేదికగా నాగార్జున రాసుకొచ్చాడు.
- October 25, 2025
0
31
Less than a minute
You can share this post!
editor

