అల్లరి నరేష్ సినిమా టీజర్ త్వరలో!

అల్లరి నరేష్ సినిమా టీజర్ త్వరలో!

మన టాలీవుడ్ హీరోస్‌లో అల్లరి నరేష్ కూడా ఒకరు. తన నుండి కామెడీ రోల్స్‌తో పాటుగా పలు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా రాగా తన నుండి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే ‘ఆల్కహాల్’. దర్శకుడు మెహర్ తేజ తెరకెక్కించిన ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పుడు టీజర్ కట్ రిలీజ్‌కి రంగం సిద్ధం చేశారు. ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్‌తో గురువారం- సెప్టెంబర్ 4న టీజర్ వస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా నుండి పోస్టర్‌తో గురువారం టీజర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంకా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన రుహాణి శర్మ, నిహారిక ఎన్ ఎమ్ లు నటిస్తున్నారు.

editor

Related Articles