తన తండ్రి నాగార్జునను కారులో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేశాడు అక్కినేని నాగచైతన్య. హైదారాబాద్‌లో ఈ ఘటన జరుగగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బీఎండబ్ల్యూ ఎం2 అనే కొత్త సిరీస్ కారును చైతూ డ్రైవింగ్ చేస్తుండగా.. నాగార్జున పక్కన కూర్చున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కుబేర, కూలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌లు అందుకున్నాడు నాగార్జున. కూలీ సినిమాలో తాను పోషించిన సైమన్ పాత్రకు అయితే మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నాగ చైతన్య విషయానికి వస్తే.. ఇటీవలే తండేల్‌తో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం విరుపాక్ష దర్శకుడు కార్తిక్ దండుతో ఒక సినిమా చేస్తున్నాడు.

- August 28, 2025
0
55
Less than a minute
You can share this post!
editor