కోడ‌ళ్ల గురించి తొలిసారి స్పందించిన అమల అక్కినేని..

కోడ‌ళ్ల గురించి తొలిసారి స్పందించిన అమల అక్కినేని..

టాలీవుడ్‌ నటి అమల ప్రస్తుతం సినిమాలకంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ఆమె చివరిసారిగా తెరపై కనిపించారు. అప్పటి నుండి కొత్త సినిమాలకు సైన్‌ చేయకపోయినా, ఆమె పబ్లిక్‌ లైఫ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల, తన కోడళ్లైన శోభిత ధూళిపాల నాగ చైతన్య భార్య, జైనబ్ -అఖిల్‌ భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమల మాట్లాడుతూ.. “నాకు అద్భుతమైన కోడళ్లు దొరికారు. వాళ్లు మంచి వ్యక్తిత్వం కలవారు. వాళ్ల వల్ల నా జీవితం కొత్తగా అనిపిస్తోంది. మా ఇంట్లో ఇప్పుడు నాకు ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది,” అంటూ నవ్వుతూ చెప్పారు. అమల తన స్వభావం గురించి చెబుతూ .. “నా కోడళ్లు ఇద్దరూ చాలా బిజీగా ఉంటారు, అది మంచి విషయం. యువత ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండటం అవసరం. వాళ్లు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లోనే ఉంటాను. సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి సరదాగా ఒకచోట గడుపుతాం. నేను డిమాండ్‌ చేసే అత్తను కాదు… అలాగే డిమాండ్‌ చేసే భార్యను కూడా కాదు,” అంటూ చిరునవ్వుతో చెప్పారు. తన కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ గురించి అమల గర్వంగా మాట్లాడారు. వాళ్లు ఇద్దరూ అద్భుతమైన యువకులుగా ఎదిగారు. నాగార్జునకి వాళ్లపై అపారమైన ప్రేమ ఉంది. నేను నా బాధ్యతల పట్ల కచ్చితంగా ఉంటాను. పిల్లల విషయంలో ఎప్పుడు నిర్ల‌క్ష్యం వ‌హించ‌ను అని చెబుతూ ముగించారు అమల.

editor

Related Articles