గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమాలో హీరోయినుగా నటించిన సంయుక్త మీడియాతో మాట్లాడుతూ, “తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘విరూపాక్ష’ తర్వాత సైన్ చేసిన బింబిసారా, విరూపాక్ష, సార్ భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ టైమ్స్ డిఫరెంట్ గా ఉన్నా ప్రతి కథలో కంటెంట్ నచ్చి చేస్తున్నాను. ఇలాంటి కథ ప్రేక్షకులు ఇష్టపడతారు, వారికి నచ్చుతుంది అని ఉద్దేశంతోనే సినిమాలు చేస్తాను. ఏదైనా ప్రేక్షకులకు నచ్చితేనే భవిష్యత్తు,” అని తెలిపింది.
- December 2, 2025
0
86
Less than a minute
You can share this post!
editor


