మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఇటీవల తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు తారలు తమకు ఎదురైన అనుభవాలను ఒక్కొక్కటికగా బయట పెడుతున్నారు. తాజాగా మరోనటి, మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ ఓ యువ రాజకీయ నాయకుడిపై చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ రిని ఆన్ జార్జ్ ఆరోపించింది. ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసింది. సినీనటి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కేరళలోని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ మంకూటిల్‌గా తెలిపింది. నటి ఆరోపణలతో పాలక్కాడ్ జిల్లాలోని ఎమ్మెల్యే కార్యాలయం వెలుపల నిరసనకు దిగింది.

- August 21, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor