మోకాలి గాయం తగ్గించుకునేందుకు తన మూత్రం తానే తాగిన న‌టుడు ప‌రేశ్ రావ‌ల్‌

మోకాలి గాయం తగ్గించుకునేందుకు తన మూత్రం తానే తాగిన న‌టుడు ప‌రేశ్ రావ‌ల్‌

బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ ప‌రేశ్ రావ‌ల్ మోకాలి గాయం నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు తన ఉచ్చ తానే తాగాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పారు. హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ తండ్రి వీరూ దేవ‌గ‌ణ్ త‌న‌కు ఆ స‌ల‌హా ఇచ్చిన‌ట్లు పేర్కొన్నాడు. ఓ ప‌త్రికకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. రాజ్‌కుమార్ సంతోషి తీసిన ఘాత‌క్ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. అయితే ఆ స‌మ‌యంలో ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో అత‌న్ని చేర్పించారు. కెరీర్ ముగిసిపోతుందేమో అన్న భ‌యంలోకి వెళ్లిపోయిన‌ట్లు అత‌ను చెప్పాడు. కానీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ తండ్రి , యాక్ష‌న్ డైరెక్ట‌ర్ వీరూ దేవ‌గణ్‌కు ఓ స‌ల‌హా ఇచ్చిన‌ట్లు తెలిపాడు. ఆస్ప‌త్రికి విజిట్ చేసిన వీరూ దేవ‌గ‌ణ్.. త్వ‌ర‌గా గాయం నుంచి కోలుకోవాలంటే నీ ఉచ్చ నీవే తాగాల‌ని స‌ల‌హా ఇచ్చిన‌ట్లు చెప్పాడు. వీరూ దేవ‌గ‌ణ్‌కు త‌న కాలి గురించి చెప్పాన‌ని, అయితే ప్ర‌తి రోజు ఉద‌యం మూత్రాన్ని తాగాల‌ని అత‌ను చెప్పిన‌ట్లు ప‌రేశ్ రావ‌ల్ గుర్తు చేశాడు. ఆ స‌మ‌యంలో మ‌ద్యం కానీ, మ‌ట‌న్ కానీ, పొగ త్రాగ‌డం కానీ చేయ‌ద్దు అని చెప్పిన‌ట్లు వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్‌, టాబూ క‌లిసి చేస్తున్న భూత్ బంగ్లా హర్రర్ కామిడీ సినిమాలో ప‌రేశ్ రావ‌ల్ న‌టిస్తున్నాడు. అక్ష‌య్ కుమార్‌, సునీల్ శెట్టి క‌లిసి తీస్తున్న హేరా ఫేరీ-3లోనూ ప‌రేశ్ యాక్టింగ్ చేస్తున్నాడు.

editor

Related Articles