అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్న అభిషేక్‌ బచ్చన్‌..!

అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్న అభిషేక్‌ బచ్చన్‌..!

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కొంతకాలం అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నా.. నన్ను నేను తెలుసుకోవాలనుంది’ అంటూ గత రాత్రి సమయంలో ఓ భావోద్వేగమైన సందేశాన్ని షేర్ చేశారు అభిషేక్‌. ‘నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాకిష్టమైన వాళ్లందరికీ నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం కొంత సమయం కావాలి’ అంటూ అభిషేక్ పోస్ట్‌లో తెలిపారు. ‘కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అందరికీ దూరంగా ఉండాలి’ అని పేర్కొంటూ ఓ సందేశం ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. పలువురు అభిమానులు స్పందిస్తూ ప్రశ్నలు కురిపించారు. ‘నటనకు గ్యాప్ తీసుకుంటున్నారా?’ అని ప్రశ్నించగా.. మరికొందరు ‘త్వరలోనే కొత్త అభిషేక్‌ను చూడబోతున్నాం’ అంటూ మరొక యూజర్‌ స్పందించాడు.  ఇదిలా ఉండగా.. అభిషేక్ చివరిసారిగా ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలో కనిపించారు. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, సంజయ్‌దత్ వంటి స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ సాధించింది. ప్రస్తుతం ఆయన ‘రాజా శివాజీ’ అనే పవర్‌ఫుల్ బయోపిక్‌లో నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన భార్య జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

editor

Related Articles