పెళ్లి చేసుకున్న ఆ మూవీ డైరెక్టర్..?

పెళ్లి చేసుకున్న ఆ మూవీ డైరెక్టర్..?

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న అభిష‌న్ జీవింత్.. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు ఉద‌యం త‌న ప్రియురాలు అక్కీల‌తో క‌లిసి ఏడ‌డ‌గులు వేశాడు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ప్రీ-రిలీజ్ వేడుక‌లో అభిష‌న్ త‌న ప్రియురాలు అక్కీల‌పై ప్రేమ‌ను వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే. అక్టోబ‌ర్ 31న న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్ర‌పోజ్ చేసి అంద‌రినీ షాక్‌కి గురిచేశాడు. అయితే చెప్పిన డేట్ ప్ర‌కార‌మే నేడు అక్కీల‌ను వివాహాం చేసుకున్నాడు అభిష‌న్. ఈ జంట‌కి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మ‌రోవైపు ఈ యువ ద‌ర్శ‌కుడికి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్ర నిర్మాత మాగేశ్ రాజ్ పాసిలియ‌న్ ఒక అద్భుత‌మైన బ‌హుమ‌తి ఇచ్చారు. త‌మ తొలి సినిమాకి మెగా విజయాన్ని అందించినందుకు కృత‌జ్ఞ‌త‌గా ఆయ‌న అభిష‌న్‌కు ల‌గ్జ‌రీ బీఎండ‌బ్ల్యూ కారును వెడ్డింగ్ గిఫ్ట్‌గా అందించారు.

editor

Related Articles