అమీర్‌ఖాన్ ‘సితారే జమీన్ పర్‌’ జూన్ 20న రిలీజ్..

అమీర్‌ఖాన్ ‘సితారే జమీన్ పర్‌’ జూన్ 20న రిలీజ్..

బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ తాజా సినిమా ‘సితారే జమీన్ పర్‌’. ‘సబ్‌ కా అప్న అప్న నార్మల్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న‌ ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమీర్‌ఖాన్ అపర్ణ పురోహిత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్ప‌టికే సినిమా నుండి ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా ట్రైల‌ర్ అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేటి రాత్రి 7.50 గంట‌లకి జీ నెట్‌వ‌ర్క్‌కి చెందిన ఛాన‌ల్స్‌లో అలాగే సోష‌ల్ మీడియాలో 8.20కి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా వీడియోను షేర్ చేసింది. అమీర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ‘తారే జమీన్ పర్‌’ (2007) సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోందని అమీర్‌ఖాన్  ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. అయితే ఈ సినిమా కామెడీ ఆధారంగా రాబోతోంద‌ని స‌మాచారం.

editor

Related Articles