రామ్‌చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా “పెద్ది” గురించి అందరికీ తెలిసిందే. అయితే పెద్ది సినిమా దాదాపు 30 శాతం పూర్తి కాగా ఈ సినిమా గ్యాప్ మధ్యలో రామ్‌చరణ్ తన వాక్స్ స్టాట్యూ ఇంకా RRR లైవ్ ఆర్కెస్ట్రా కార్యక్రమాలకి హాజరు కావడం జరిగింది. మరి అలా తన అభిమానులతో లండన్‌లో కూడా ముచ్చటించిన గ్లోబల్ స్టార్‌కి అక్కడి అభిమానులు ఎంతో ఆప్యాయంగా ఒక స్పెషల్ బ్యాట్‌ని పెద్ది సినిమా ఫస్ట్ షాట్ హిట్ అయ్యిన కారణంగా అందించారు. దానిపై రామ్ చరణ్ తన ఆటోగ్రాఫ్ సంతకం చేయడం విశేషం. దీనితో ఈ విజువల్స్ ఇపుడు వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా విడుదల చేస్తారు.
- May 14, 2025
0
154
Less than a minute
Tags:
You can share this post!
editor

