ఇటీవల మలయాళ సినిమా నుండి రిలీజ్‌కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన పలు సినిమాల్లో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో దర్శకుడు జీతూ అష్రఫ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామా ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా ఒకటి. మరి మోలీవుడ్‌లో హిట్ అయ్యిన ఈ సినిమాని తెలుగులో కూడా కేవలం కొన్ని రోజులు కితమే థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ మార్చ్ 15న రిలీజ్ చేయగా ఇపుడు మార్చ్ 20కి ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో మలయాళం సహా తెలుగు, ఇతర పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌ని చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
- March 20, 2025
0
132
Less than a minute
Tags:
You can share this post!
administrator


