డార్లింగ్ ప్రభాస్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. మారుతితో రాజాసాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తి అయ్యాక నాగ్ అశ్విన్‌తో కల్కి – 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్స్‌లో సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాని సందీప్ ఏ జానర్‌లో తెరకెక్కిస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఇక ప్రభాస్‌కి జోడీగా దీపిక పదుకొణెని తీసుకోవాలని సందీప్ అనుకున్నాడట. సందీప్ వంగా దర్శకత్వం వహించనున్న `స్పిరిట్` కోసం దీపికని సంప్రదించగా, ఆమె భారీ పారితోషికంతో పాటు, పెద్ద మొత్తంలో షేర్‌ని డిమాండ్ చేసిందని, పైగా 8 గంటలు మాత్రమే పనికి కేటాయిస్తానని కండిషన్స్ కూడా పెట్టిందని సమాచారం. మరి ప్రస్తుతం దీపికకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలలో వాస్తవం ఏంటన్నది తెలియాల్సి ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీపిక స్థానంలో అనుష్కని తీసుకోవాలని భావిస్తున్నట్టు టాక్.
- May 22, 2025
0
86
Less than a minute
Tags:
You can share this post!
editor


