హీరో రామ్ చరణ్ – డైరెక్టర్ త్రివిక్రమ్‌ల కలయికలో కొత్త సినిమా?

హీరో రామ్ చరణ్ – డైరెక్టర్ త్రివిక్రమ్‌ల కలయికలో కొత్త సినిమా?

టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంబో తెర‌పైకి రాబోతోంది. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ క్రేజీ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ చివరి సినిమా ‘గుంటూరు కారం’ తర్వాత తన తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగింది. మొదట అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నప్పటికీ, బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉండటంతో, త్రివిక్రమ్ సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్‌తో ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే తాజా సమాచారం ప్రకారం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్రివిక్రమ్ రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ కథను చరణ్‌కు వినిపించగా, ఆయన కూడా ఓకే చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాకి పవన్ కళ్యాణే నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

editor

Related Articles