అనసూయ 1985 మే 15న సుదర్శనరావు, అనూరాధ దంపతులకు జన్మించింది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్‌సిసిలో చేర్పించారు వాళ్ల తల్లిదండ్రులు. మా మ్యూజిక్‌లో పనిచేసింది. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈటీవీలో ప్రారంభించిన కామెడీ షో ‘జబర్దస్త్’కి అనసూయను ప్రజెంటర్‌గా ఎంపిక కావడంతో ఆమె లైఫ్‌టర్న్ అయింది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించి నటిగా మారింది. సినిమాలు, షోస్, సోషల్ మీడియా, ఓపెనింగ్స్ ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొత్తింట్లోకి అడుగుపెట్టింది. అయితే మే 15న అనసూయ బర్త్ డే కాగా, ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. హైదరాబాద్‌లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది. అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్లతో కలిసి చిందులు వేసింది అనసూయ. బర్త్ డేకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
- May 16, 2025
0
85
Less than a minute
Tags:
You can share this post!
editor


