టాలీవుడ్‌లో కొందరు హీరోల తాలూకా వారసుల ఎంట్రీపై మాత్రం వారి అరంగేట్రంకి ముందు నుండే ఓ రేంజ్ హైప్ నెలకొంటుంది. అలా ఈ మధ్య కాలంలో ఒకప్పుడు నుండి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై సాలిడ్ హైప్ నెలకొనగా ఇప్పుడు మరో బిగ్ హీరో పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అకిరా ఎంట్రీపై ఇప్పుటివరకు చాలా ఊహాగానాలు వినిపిస్తూనే వచ్చాయి. ఓ పక్క సంగీత పరంగా థమన్ ఓజి సినిమా కోసం అకిరాతో వర్క్ చేస్తా అని చెప్పాడు. కానీ నటుడుగా ఎప్పుడు డెబ్యూ ఇస్తాడు అనేది ఇప్పుడు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అకిరా వచ్చే మరో రెండేళ్ల తర్వాత వెండితెరపై హీరోగా పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. సో పవన్ అభిమానులు ఇంకో రెండేళ్లు అకిరా కోసం ఆగాల్సిందే అని చెప్పాలి. మరి చూడాలి తన ఎంట్రీ ఎవరితో ఏ రేంజ్‌లో ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.
- February 19, 2025
0
256
Less than a minute
Tags:
You can share this post!
administrator

