బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రిలో ఎడ్‌మిట్ చేశారు. సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. తెల్లవారు గట్ల 3.30 గంటలకు ఆయనను దవాఖానాకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత తెలియజేస్తామన్న డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. పరారైన వ్యక్తి కోసం పోలీసులు బ్యాచ్‌లుగా నగరంలో గాలిస్తున్నారు.
- January 16, 2025
0
256
Less than a minute
Tags:
You can share this post!
administrator

