హీరో అల్లు అర్జున్ మరి కాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానాకు వెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈ ఘటనలో బాలుని తల్లి మృతిచెందిన విషయం తెలిసిందే. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు కిమ్స్ దవాఖానాకు ఎప్పుడు వెళ్లినా.. తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు. రెగ్యులర్ బెయిల్ వచ్చిన నేపథ్యంలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తారన్న ప్రచారం జరగటంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

- January 7, 2025
0
150
Less than a minute
You can share this post!
editor