2025 ఆడియన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది అందాలభామ నిధి అగర్వాల్. ఒకే ఏడాది ఇద్దరు సూపర్స్టార్లతో రెండు పానిండియా సినిమాల్లో ఆమె యాక్ట్ చేస్తోంది. అందులో ఓ సినిమా పవన్‌కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కాగా, రెండో సినిమా ప్రభాస్ ‘రాజా సాబ్’. ఈ సందర్భంగా ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘పవన్ సార్‌తో ‘హరిహర వీరమల్లు’లో నటించడం చాలా అదృష్టంగా, ఆనందంగా భావిస్తాను. అసలు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వకారణం కూడా. ఇక ‘రాజా సాబ్’లో ప్రభాస్ సార్‌తో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి. సినిమాకోసం టీమ్ మొత్తం డెడికేటెడ్‌గా పనిచేస్తున్నారు. ఈ రెండు పాన్ఇండియా సినిమాలూ 2025లోనే విడుదల కానున్నాయి. అందుకే 2025 నా లక్కీ ఇయర్. వీటితో పాటు వచ్చే ఏడాది తెలుగు, తమిళంలో మరికొన్ని సర్ప్రైజింగ్ సినిమాలలో నటిస్తున్నాను. వాటి గురించి, ఆ సినిమాల పేర్ల గురించి త్వరలో తెలియజేస్తా.’ అన్నారు నిధి అగర్వాల్.
 
											- December 31, 2024
				
										 0
															 97  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				

 
											 
											