సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ ఓ ఇంటివాడు అయ్యాడు. నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని Ras Al Khaimahలో డిసెంబర్ 14న రాత్రి పెళ్లివేడుక గ్రాండ్‌గా జరిగింది. అన్న కుమారుడి వివాహానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన భార్య రమాతో కలిసి హాజరు అయ్యారు. వివాహ వేడుక ముగియడంతో సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహ వేడుకలు జరిపించిన ప్రతి ఒక్కరికి రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు. ‘గత 10 రోజులు సింహా – రాగ వివాహ సమయంలో చాలా అందమైన అనుభూతులతో నిండిపోయింది. కుటుంబంలోని మనందరికీ దీన్ని నిజంగా గుర్తుండిపోయేలా చేసిన వ్యక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’ అంటూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ ఎవరు ఏ విధంగా సాయం చేశారో వెల్లడించారు రాజమౌళి.
- December 21, 2024
0
111
Less than a minute
Tags:
You can share this post!
editor


