తమన్నా పీకలలోతు ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో ఆమె గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా కూడా ధృవీకరించారు. కానీ.. పెళ్లి గురించి మాత్రం ఇప్పటివరకూ స్పందించడం లేదు. ఇదిలావుంటే.. ఈ జంట వచ్చే ఏడాది వివాహం చేసుకోనున్నారనేది బాలీవుడ్ న్యూస్. సాధారణంగా కొత్తగా పెళ్లాడిన బాలీవుడ్ ప్రేమజంటలు ముంబైలోని బాంద్రా సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్లు కొంటూ ఉంటారు. తమన్నా, విజయ్‌వర్మలు కూడా బాంద్రాలో సౌకర్యవంతమైన అపార్ట్‌మెంట్స్ కోసం సెర్చింగ్‌లో ఉన్నారనేది బీటౌన్ టాక్. ఇటీవల తన ప్రేమ వ్యవహారం గురించి తమన్నా మాట్లాడుతూ ‘విజయ్ రాకతో నా లైఫ్ టర్న్ అయింది. తను పక్కనుంటే ప్రపంచాన్ని సైతం గెలవగలను అనిపిస్తుంది. తన నిజాయితీ అంటే నాకిష్టం..’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. మరి వచ్చే ఏడాది పెళ్లంటూ వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.
- November 23, 2024
0
111
Less than a minute
You can share this post!
editor


