‘థాంక్యూ’ సినిమా తర్వాత టాలీవుడ్‌లో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తోంది. హిందీలో ఆమె నటించిన ‘ది సబర్మతీ రిపోర్ట్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. గుజరాత్ గోద్రా రైలు దహనం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రాశీఖన్నా. గతంలో తాను ప్రేమలో ఉన్నానని, అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయిందని తన విఫల ప్రేమను తలచుకొని భావోద్వేగానికి గురైంది. రాశీఖన్నా మాట్లాడుతూ ‘నేను చాలా సున్నిత మనస్కురాలిని. కొన్నేళ్ల క్రిందట ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. కానీ దురదృష్టవశాత్తు మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. కొన్ని నెలల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఆ తర్వాత ధైర్యాన్ని కూడగట్టుకొని కెరీర్ మీద దృష్టి పెట్టాను. నా శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యుల మద్దతు వల్ల ఆ క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడ్డా’ అని చెప్పింది.
- November 14, 2024
0
161
Less than a minute
Tags:
You can share this post!
administrator


