తమిళ హీరో, సినీ యాక్టర్ విజయ్ దళపతి రాజకీయ TVK పార్టీని స్థాపించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది ఆ విషయం చెప్పనక్కర్లేదు. తన పార్టీ రాజకీయాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశతో ముందుకెళ్తున్నామన్నారు. విజయ్ రాజకీయ రంగప్రవేశంపై రజనీకాంత్ స్పందించారు. టీవీకే తొలి బహిరంగ సభను చాలాచక్కగా నిర్వహించారంటూ అభినందించారు. అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో టీవీకే భారీసభ నిర్వహించింది. విజయ్ అభిమానులు, మద్దతుదారులు భారీగా ఆ సభకు తరలివచ్చారు. ప్రసంగం వాడీవేడిగా సాగింది. బీజేపీ, డీఎంకే పార్టీలను తమ ప్రత్యర్థులుగా ప్రకటించారు. అలాగే, పలు పార్టీలకు స్నేహహస్తాన్ని అందించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని విజయ్ చెప్పారు.
- November 1, 2024
0
277
Less than a minute
Tags:
You can share this post!
administrator

