జబర్దస్త్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తున్న తాజా సినిమా ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ సినిమా అంజి డైరెక్ట్ చేస్తుండగా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీస్తున్నారు. నేడు ట్రైలర్ విడుదల చేయగా.. యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన హృదయ కాలేయం, బేబీ సినిమాల డైరెక్టర్ సాయి రాజేష్ వేదికపై ఉన్న యాంకర్ అనసూయపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ కామెడీ షోలో నేను అనసూయ చాలారోజులు కలిసి పనిచేశాం. అయితే ఒకరోజు అనసూయతో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది చూసివారు చాలామంది నన్నే అనసూయ భర్త అనుకున్నారు. దీంతో నన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అనసూయ ఎక్కడ నువ్వు ఎక్కడా అంటూ కామెంట్లు పెట్టారు. తర్వాతి నేను క్లారిటీ కూడా ఇచ్చాను అంటూ సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
- October 19, 2024
0
258
Less than a minute
Tags:
You can share this post!
administrator

