చికెన్ లేక ఫెయిల్ అయ్యా: వరుణ్ తేజ్

చికెన్ లేక ఫెయిల్ అయ్యా: వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పటి ఓ సరదా సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. “నాన్‌వెజ్ లేకుండా నేను భోజనం చేయలేను. చిన్నప్పుడు ఓసారి ఇంట్లో చికెన్ వండకపోవడంతో రాత్రంతా ఏడ్చాను. దాని ప్రభావం మరుసటి రోజు జరిగిన పరీక్షపై పడింది. సరిగా పరీక్ష రాయలేక ఫెయిల్ అయ్యాను. చికెన్ అంటే నాకు అంత ఇష్టం” అని వరుణ్ తెలిపారు.

చికెన్‌తో పాటు మటన్, చేపలు, రొయ్యలు, పీతలు కూడా తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. రోజువారీ ఆహారంలో నాన్‌వెజ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles