ఆత్మవిశ్వాసం వెనుక మా అమ్మానాన్న: ప్రీతి

ఆత్మవిశ్వాసం వెనుక మా అమ్మానాన్న: ప్రీతి

యువ నటి ప్రీతి ముకుందన్ తన నటనా ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంత కీలకమో వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మొదటి ఆడిషన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మా కుటుంబంలో చదువుకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అదే సమయంలో నాకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లాలని మా అమ్మానాన్న ఎప్పుడూ ప్రోత్సహించారు. కెరీర్ ప్రారంభంలో కొంతకాలం మోడలింగ్ చేశాను. 18 ఏళ్ల వయసులోనే ఓ సినిమాలో అవకాశం వచ్చినా, నటనపై నమ్మకం లేక ఆడిషన్ ఇవ్వడానికి తొలుత నిరాకరించాను’’ అని చెప్పారు.

అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆడిషన్‌కు వెళ్లానని, ఆ పాత్ర దక్కకపోయినా అదే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. ‘‘ఆడిషన్‌లో ఎంపిక కాకపోయినా ప్రయత్నించాలనే ధైర్యం వచ్చింది. చిత్రపరిశ్రమ గురించి మా కుటుంబానికి పెద్దగా అవగాహన లేకపోయినా, నా ఇష్టాన్ని గౌరవించి ముందుకు వెళ్లమని చెప్పడం నాకు ఎంతో బలం ఇచ్చింది. అప్పటి నుంచే నటనపై ఆసక్తి పెరిగి, సినిమాలను ప్రేమించడం ప్రారంభించాను’’ అని ప్రీతి చెప్పారు. ‘బ్లాస్ట్’, ‘హృదయం మురళీ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రీతి ముకుందన్ ప్రస్తుతం మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Related Articles