కార్తికేయను ఆటపట్టించిన లోకేష్

కార్తికేయను ఆటపట్టించిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ, ఆయన భార్య పూజా ప్రసాద్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో నూతన మహిళా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కళాశాల నిర్మాణానికి పూజా ప్రసాద్ తల్లి విరాళం అందించగా, కార్యక్రమానికి లోకేష్, కార్తికేయ, పూజా ప్రసాద్ హాజరయ్యారు.

వేదికపై మాట్లాడుతున్న సమయంలో నారా లోకేష్ పూజా ప్రసాద్‌ను ఉద్దేశించి, “కార్తికేయ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా?” అంటూ సరదాగా ప్రశ్నించారు. దీనికి పూజా ప్రసాద్ “ఎలాంటి కంప్లైంట్స్ లేవు” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. వెంటనే కార్తికేయ వైపు తిరిగిన లోకేష్ “బచ్ గయా!” అంటూ చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారిక కార్యక్రమంలోనూ లోకేష్ ప్రదర్శించిన హాస్యచతురతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ అన్‌స్క్రిప్టెడ్ మూమెంట్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Articles