బిగ్‌బాస్‌కు గంగూలీ హోస్ట్

బిగ్‌బాస్‌కు గంగూలీ హోస్ట్

భారత టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ చరిత్రలో తొలిసారి ఓ మాజీ క్రికెటర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బెంగాలీ ‘బిగ్‌బాస్’ సీజన్ -3కు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు జియోహాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.

సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సీజన్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్లు ప్రారంభం కానున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్‌లుగా కొనసాగనున్నారు.

బెంగాలీ ‘బిగ్‌బాస్’ కోసం గంగూలీకి రూ.125 కోట్ల పారితోషికం అందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత బెంగాలీ ‘బిగ్‌బాస్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో నిర్వాహకులు గంగూలీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో ‘దాదాగిరి అన్‌లిమిటెడ్’ షోతో హోస్ట్‌గా విజయవంతమైన గంగూలీ, ఇప్పుడు ‘బిగ్‌బాస్’లో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Related Articles