కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేకు మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన తమిళ సినిమా ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘శ్రీశ్రీ’ సినిమాలో నటిస్తోంది.
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ –లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో బన్నీతో కలిసి ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో నటించిన పూజా విజయవంతమైన జోడీగా గుర్తింపు పొందింది.
మరోవైపు రవితేజ, శ్రీ విష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్‌లో కూడా పూజా హెగ్డేను ఒక హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ రెండు ప్రాజెక్టులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో మరోసారి బిజీ షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

