రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘మనసాగదే’ అనే మెలోడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. యశ్, తారా సుతారియా మధ్య సాగే ఈ ప్రేమగీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
‘మనసాగదే.. కొనసాగదే.. నను నన్నుగా నిలువనీయదే’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. మెలోడీ ట్యూన్‌తో పాటు యశ్ -తారా మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నయనతార, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలైన తొలి మెలోడీ సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

