రాజమౌళి మూవీలో నటిస్తా: సింధు

రాజమౌళి మూవీలో నటిస్తా: సింధు

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందించారు. “జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చావు. దేశమంతా నీ విజయంపై గర్విస్తోంది” అంటూ రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు.

దీనికి స్పందించిన పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ ‘వారణాసి’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒకవేళ మీ సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పాత్ర ఉంటే నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ సరదాగా స్పందించారు. ఆమె చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సింధు వ్యాఖ్యలతో ఆమె భవిష్యత్తులో సినిమాల్లో నటించే అవకాశాలపై నెటిజన్లలో చర్చ మొదలైంది. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రాజమౌళి సినిమాల్లో నటించాలనే ఆసక్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles