నటసింహం బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటి ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె హీరోయిన్‌గా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తి స్థాయి మాస్ యాక్టర్‌గా చూపించేందుకు కొరటాల శివ ప్రత్యేకంగా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని, అందులో బాలకృష్ణ కొత్త లుక్‌లో కనిపించనున్నారని టాక్. ఆ ఫ్లాష్‌బ్యాక్ మాఫియా నేపథ్యంతో సాగుతుందని సమాచారం.
యాక్షన్‌తో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలకు కూడా కథలో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

