తమిళ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా జులై 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం కానుండగా, పరిమితంగా అందుబాటులో ఉంచిన టికెట్లకే విశేష స్పందన లభించింది. కేవలం శనివారం ఒక్కరోజులోనే బుక్‌మైషోలో 40 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.
దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న తొలి సినిమా కావడం విశేషం. దీంతో అభిమానులు ఈ సినిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత టికెట్ విక్రయాలు మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

