ఎన్టీఆర్ సినిమాలో కార్తికేయ విశేషాలు

ఎన్టీఆర్ సినిమాలో కార్తికేయ విశేషాలు

ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న పాన్- ఇండియా మైథాలజికల్ యాక్షన్ చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాని దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

సినిమా ప్రకటించినప్పటి నుంచి కథపై పలు ఊహాగానాలు, వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా “ఉత్తరంలో జన్మించి, దక్షిణంలో ఆరాధించబడే దేవుడు” అనే కాన్సెప్ట్ చర్చకు దారితీసింది. అయితే చిత్ర బృందం కథను ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతోంది.

మాకు లభించిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కార్తికేయుని గురించి చాలా మందికి తెలియని అంశాలు, ఆయన జన్మ విశేషాలతో పాటు చేసిన యుద్ధాలు, వీరగాథలను కూడా విస్తృతంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Related Articles