విజయ్-త్రిషపై ధ్యాన్ సరదా వ్యాఖ్యలు

విజయ్-త్రిషపై ధ్యాన్ సరదా వ్యాఖ్యలు

మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన తాజా చిత్రం ‘విజిటర్’ ప్రమోషన్ కార్యక్రమంలో సహనటి నవ్యా నాయర్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, భవిష్యత్తులో తాను కేరళ ముఖ్యమంత్రి అయితే ప్రమాణ స్వీకార వేడుకలో తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని తనను చూడాలని చమత్కరించారు. దీనికి నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ, “నువ్వు సీఎం అయితే చెప్పినట్టే ముందు వరుసలో కూర్చొని నీకు జై కొడతా. కానీ నాకు సీటు రిజర్వ్ చేయాలి” అంటూ నవ్వులు పూయించారు.

అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో ముడిపెడుతున్నారు. ఆ వేడుకలో నటి త్రిష ముందు వరుసలో కూర్చొని భావోద్వేగానికి గురైన ఘటనను ధ్యాన్ పరోక్షంగా ప్రస్తావించారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో కొందరు విజయ్ అభిమానులు ధ్యాన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

వివాదం పెరగడంతో నటుడు అజు వర్గీస్ వేదికపైకి వచ్చి, “విజయ్ సార్.. నా ఫ్రెండ్‌ను క్షమించండి” అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో కార్యక్రమం నవ్వుల మధ్య ముగిసింది.

Related Articles