వరుణ్ తేజ్‌లోకి కొరియన్ ఆత్మ.. అసలు ఏం జరిగింది?

వరుణ్ తేజ్‌లోకి కొరియన్ ఆత్మ.. అసలు ఏం జరిగింది?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రాన్ని రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. రాయలసీమకు చెందిన కనకరాజు అనే యువకుడు ఓ కొరియన్ యువతిని ప్రేమించిన తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే అతీంద్రియ సంఘటనలే కథకు ప్రధాన ఆకర్షణ. కొరియన్ ఆత్మ అతడిని ఆవహించడంతో కథలో హారర్, కామెడీ, ఫాంటసీ, యాక్షన్ అంశాలు ఆసక్తికరంగా మిళితమవుతాయి. వరుణ్ తేజ్ రాయలసీమ యాసలో సహజంగా నటించి ఆకట్టుకోగా, సత్యతో కలిసి చేసిన కామెడీ సన్నివేశాలు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్ రితికా నాయక్ అందంగా కనిపించారు. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ టీజర్‌ను మరింత ఎలివేట్ చేశాయి. వినోదాత్మక అంశాలతో నిండిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles